News February 11, 2025
మల్కాజిగిరి: మహిళల రక్షణే ధ్యేయం: డీసీపీ

మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ హెచ్చరించారు. నెల రోజుల్లో 163 మంది పోకిరిలను సాక్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోఈవ్ టీజర్లకు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
Similar News
News March 12, 2025
మారనున్న KBC హోస్ట్!

‘కౌన్ బనేగా కరోడ్పతి’ హోస్ట్గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News March 12, 2025
సిద్దిపేట: దివ్యాంగులు ధైర్యంగా ఉండాలి: డీఈఓ

దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా మానసిక స్తైర్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవన్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 57 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులు ఉపకరణాలు ఉపయోగించి మానసికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
News March 12, 2025
పోసానిపై బాపట్లలో కేసు నమోదు

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆయనపై బాపట్ల పోలీస్ స్టేషన్లో బుధవారం కొత్తగా కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బాపట్ల పీఎస్లో కేసు నమోదు చేశారు.