News February 11, 2025

మల్కాజిగిరి: మహిళల రక్షణే ధ్యేయం: డీసీపీ 

image

మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ హెచ్చరించారు. నెల రోజుల్లో 163 మంది పోకిరిలను సాక్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోఈవ్ టీజర్లకు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

Similar News

News March 16, 2025

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.200-240 ఉండగా విత్ స్కిన్ కేజీ రూ.170-180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.150-160 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

News March 16, 2025

నల్గొండలో చికెన్ ధరలు ఇలా

image

నల్గొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్‌ స్కిన్) కేజీ రూ.145 ఉండగా.. స్కిన్‌లెస్ కేజీ రూ. 165 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.100 ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, గత మూడు రోజులుగా అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

News March 16, 2025

అమరజీవి త్యాగం మరువలేనిది: నెల్లూరు కలెక్టర్ 

image

అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిది, అపారమైనదని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు శ్రీరాములు అని కలెక్టర్ కొనియాడారు. 

error: Content is protected !!