News February 20, 2025
మల్కాజిగిరి: 63 కిలోల ఎండు గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆలేరు, మహబూబాబాద్, కాజీపేట ప్రాంతంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 63 కిలోల గంజాయి పట్టుబడినట్లు రైల్వే బృందం తెలిపింది. దీని విలువ దాదాపుగా రూ.20.25లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 3రోజులుగా రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు.
Similar News
News March 26, 2025
ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానల్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని కోరారు. ఫెజ్-1 ఎంపికలకు ఎడిట్ ఆప్షన్ లేదన్నారు.
News March 26, 2025
ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల

AP: ఉగాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.
News March 26, 2025
జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పట్టణాలు మండల కేంద్రాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వాహనాలు పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.