News April 25, 2024

మల్కాజిగిరి BRS అభ్యర్థి ఆస్తులు రూ.82.54 కోట్లు

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు రూ.82.54 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.62.12 కోట్లు, చరాస్తులు రూ.20.42 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అప్పులు రూ.10.20 కోట్లు, ప్రస్తుతం నగదు రూ.5.70 లక్షల ఉండగా.. బంగారం 2,000 గ్రాములు, వెండి 4 కిలోలు, ఒక డైమండ్ ఉన్నట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

రంగారెడ్డి డీసీసీ ఆలస్యం ఎందుకు ‘అధ్యక్షా’

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.

News November 27, 2025

CUA మహా మాస్టర్ ప్లాన్‌: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

image

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్‌లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.

News November 27, 2025

RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

image

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్‌నగర్(47), శంషాబాద్‌ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది