News April 15, 2025
మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News December 6, 2025
ESIలో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ

ESIC తీసుకొచ్చిన SPREEలో కంపెనీల యజమానులు, ఉద్యోగులు చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ. దీనివల్ల ఇరువురికీ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ అందుతాయి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగిన యజమానులు www.esic.gov.inలో నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన రోజు నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. మునుపటి రోజులకు తనిఖీ ఉండదు. జీతం నెలకు రూ.21వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు అర్హులు.
News December 6, 2025
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడటాన్ని స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందంటున్నారు నిపుణులు. ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
News December 6, 2025
ప్రపంచంపై మళ్లీ పంజా విసురుతున్న మలేరియా

ప్రపంచ వ్యాప్తంగా మలేరియా మళ్లీ విజృంభిస్తోంది. 2024 నుంచి ఇది బలంగా వ్యాపిస్తున్నట్లు WHO తాజా నివేదిక వెల్లడించింది. 28.20 కోట్ల మందికి ఇది సోకిందని, గతంతో పోలిస్తే 9కోట్ల కేసులు పెరిగాయని తెలిపింది. ఔషధ నిరోధక శక్తి పెరగడం, బలహీన ఆరోగ్య వ్యవస్థలు, నియంత్రణకు నిధుల కొరత దీనికి కారణంగా పేర్కొంది. ప్రపంచ దేశాలు మేలుకోకపోతే మలేరియా నివారణలో 20 ఏళ్లుగా సాధించిన పురోగతి వెనక్కి పోతుందని వివరించింది.


