News June 13, 2024
మల్కాపురం సీఐపై సస్పెన్షన్ ఎత్తివేత
మల్కాపురం సీఐ ఎస్.సన్యాసి నాయుడుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. 45 రోజుల కిందట ఎన్నికల్లో పోటీకి దిగిన ఓ రౌడీ షీటర్‌పై సీఐ దౌర్జన్యం చేసి దుర్భాషలాడి పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలపై సీఐను సస్పెండ్ చేశారు. అనంతరం నిర్వహించిన దర్యాప్తులో వ్యక్తిగత కక్షతో రౌడీషీటర్ లేనిపోని ఆరోపణలు చేసినట్లు తేలింది.
Similar News
News September 21, 2024
ఎస్.రాయవరంలో గురజాడ జయంతికి ఏర్పాట్లు
మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.
News September 20, 2024
విశాఖ: అత్యాచారం కేసులో సంచలన తీర్పు
విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి జీ.వెంకట రమణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆనందీ తీర్పు వెలువరించారు.
News September 20, 2024
మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ఎండీ
విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.