News March 12, 2025

మల్దకల్లో 37 9°c ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రేపటి నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 37 9°c, గద్వాల్లో 37.3°c, అలంపూర్‌లో 37.1°c, సాతర్లలో 36.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 25, 2026

2021లోనే నీళ్లు ఇచ్చేవాడిని: సీఎం

image

2019 – 24లో సీఎంగా ఉండుంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4,35,000 ఎకరాల సాగుకు నీళ్లు వచ్చేవన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019 – 24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.

News February 25, 2026

ఖమ్మంలో శుక్రవారం దిశ సమావేశం: కలెక్టర్

image

ఖమ్మంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరగనుండగా, సభ్యులు, ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో తప్పని సరి హాజరుకావాలని సూచించారు.

News February 25, 2026

మెదక్: తొలిరోజు 99.42 శాతం

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.