News February 28, 2025

మల్దకల్: అమ్మా, నాన్న లేక అనాథలయ్యారు!

image

మల్దకల్ మండలం చర్లగార్లపాడులో అనారోగ్యంతో తల్లి, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మృతి చెందగా ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కుమ్మరి వీరేశ్, భారతి కుండలు చేస్తూ జీవిస్తున్నారు. భారతి జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేని లోటు, ఆర్థిక ఇబ్బందులతో వీరేశ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు అంటున్నారు.

Similar News

News November 15, 2025

యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News November 15, 2025

తెలంగాణ హైకోర్టు వెబ్‎సైట్ హ్యాక్

image

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‎లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్‎సైట్‎లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

సంగారెడ్డి: సర్వే చేయించుకున్నారు.. పైసలిస్తలేరు!

image

జిల్లాలో గత ఏడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు పారితోషకాన్ని చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే చేసి ఏడాది గడిచిన పారితోషకం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారితోషకాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.