News January 29, 2025

మల్దకల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

image

రెండు బైకులు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మల్దకల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి వస్తున్న బైక్‌, సద్దలోని పల్లి గ్రామం నుంచి వస్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.

Similar News

News February 13, 2025

అంతర్జాతీయ పోటీల్లో నిర్మల్ బిడ్డల ప్రతిభ

image

ఇటీవల దిల్లీలో నిర్వహించిన నాలుగో ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కిక్ బాక్సింగ్ సెక్రటరీ మహిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన అక్షయ, నాగలక్ష్మితో పాటు జట్టును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, శిక్షకులు తదితరులున్నారు.

News February 13, 2025

పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్‌2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.

News February 13, 2025

ముప్కాల్: హైవేపై యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించలన్నారు.

error: Content is protected !!