News January 27, 2025
మల్యాల: ఉపాధ్యాయురాలు ఆకస్మిక మరణం

మల్యాల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మమత (30) ఆదివారం ఆకస్మిక మరణం చెందారు. పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన మమత మల్యాలలోని మణికంఠ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఈ నెల 24న జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ రోజు ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
Similar News
News September 19, 2025
అరకు: హైడ్రో పవర్ నిర్మాణం చేపడితే బాణాలతో తరిమికొడతాం

అల్లూరి జిల్లా మన్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అరకులోయ(M) బస్కిపంచాయతీలోని కంజరితోటలో గిరిజనులు డిమాండ్ చేశారు. బస్కి, కురిడీలోఈ ప్రాజెక్టు ఏర్పాటును విరమించుకోకపోతే బాణాలతో తరిమికొడతామన్నారు. నేడు అరకులోయలో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ర్యాలీలో ఆదివాసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News September 19, 2025
‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News September 19, 2025
ఏలూరు: నంబర్ ప్లేట్లపై ఇలా రాస్తే..ఇక వాహనం సీజ్

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై వారి తాలూకా అనిరాసినా, నిబంధనలకు లోబడి లేకున్నా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వీటి తయారీదారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. నంబర్ ప్లేట్లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలని ఆయన గురువారం ఆదేశించారు.