News March 20, 2025
మల్యాల: నెక్స్ట్ ఐదేళ్లు కాంగ్రెస్ దే అధికారం: ఎమ్మెల్యే

నెక్స్ట్ ఐదేళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం ఉంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మల్యాల మండలంలోని మానాల గ్రామంకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన ఆయన ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సులో టికెట్ తీసుకొని కొద్ది దూరం ప్రయాణించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
Similar News
News March 31, 2025
సిరిసిల్ల: కుటుంబ సభ్యుల పాత్ర కీలకం: కమాండెంట్

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో కుటుంబసభ్యుల బాధ్యత చాలా కీలకమని సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులోని బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ వై నారాయణ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగంచేసి శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని స్పష్టంచేశారు. ఉద్యోగవిరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.