News March 20, 2025

మల్యాల: రెండు పీఏసీఎస్‌లకు స్పెషల్ ఆఫీసర్స్

image

మల్యాల మండలంలోని పోతారం, నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్లు సుజాత, శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినట్లు సీఈవోలు తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న సొసైటీలలో మాత్రమే స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం ఎంతవరకు సమంజసమని నూకపల్లి సొసైటీ ఛైర్మన్ మధుసూదన్ రావు ప్రశ్నించారు.

Similar News

News March 21, 2025

రెండేళ్ల తర్వాత రూపాయికి బెస్ట్ వీక్ ఇదే

image

భారత రూపాయి అదరగొట్టింది. డాలర్‌తో పోలిస్తే ఈ రెండేళ్లలో ఈ వారమే అత్యధికంగా ఎగిసింది. 1.2 శాతానికి పైగా బలపడింది. నేడు ఏకంగా 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ పతనమవ్వడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి RBI మద్దతివ్వడం, ఫారిన్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటం, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం, మొత్తం సర్‌ప్లస్ $4.5 బిలియన్లకు చేరడమే ఇందుకు కారణాలు.

News March 21, 2025

NRPT: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ 

image

ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అర్హత ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్పించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చెప్పారు.

News March 21, 2025

మంగళగిరి: సీసీటీవీల పురోగతిపై హోంమంత్రి సమీక్ష 

image

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తాతో పాటు జిల్లాల ఎస్సీలతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతి, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు ఇచ్చారు. 

error: Content is protected !!