News April 13, 2025

మల్యాల: 2000 వాటర్ బాటిళ్ళ పంపిణీ

image

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో కరీంనగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి సేవాసమితి అధ్యక్షురాలు పూరెల్ల సరోజ ఆధ్వర్యంలో 2000 వాటర్ బాటిళ్ళను కొండగట్టుకు వచ్చే దీక్షా స్వాములకు, అలాగే గుట్టపైన శానిటేషన్ చేసే సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ సరోజ మాట్లాడుతూ.. భక్తులకు సేవ చేయడం చాలా ఆనందం కలిగిందని అన్నారు.

Similar News

News April 17, 2026

3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

image

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.

News April 17, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SP సుబ్బరాయుడు

image

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. గురువారం SP కార్యాలయం నుంచి బ్యాంకర్లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులను నమ్మవద్దని కోరారు. OTP, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాల వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.