News January 24, 2025
మల్లంపల్లి మండలాన్ని ప్రారంభించిన మంత్రులు

ములుగు జిల్లాలో నూతన మల్లంపల్లి మండలాన్ని రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి మల్లంపల్లి మండల ఏర్పాటు కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు అశోక్, గ్రంథాలయ ఛైర్మన్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
22 నుంచి నగరంలో పలు చోట్ల భగవద్గీత పోటీలు

టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భగవద్గీత పోటీలు జరుగనున్నాయి. 22న కుత్బుల్లాపూర్(వేణుగోపాలస్వామి గుడి), 28న టీటీడీ బాలాజీ భవన్, 29న సరూర్నగర్ (విక్టోరియా మెమోరియల్ స్కూల్)లో పోటీలు జరుగుతాయని టీటీడీ అధికారి రమేశ్ కుమార్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 90308 50336 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
News November 7, 2025
Fact Check: పాత ₹500, ₹1,000 నోట్లు మార్చుకోవచ్చా?

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.
News November 7, 2025
VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.


