News February 28, 2025
మల్లన్నకు ఇరుముడి సమర్పించిన కార్మిక శాఖ మంత్రి

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శివమాల ధరించిన ఆయన ఈ సందర్భంగా స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ఆలయగా రాజగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు, అధికారులు, అర్చక స్వాములు ఉన్నారు.
Similar News
News November 6, 2025
KMR: ఆక్రోశ సభకు బీసీలు తరలిరావాలి: DSP

42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నవంబర్ 15న కామారెడ్డి జిల్లాలో జరుగబోయే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు, విశారదన్ మహారాజ్ల నాయకత్వంలోనే బీసీల 42% రిజర్వేషన్ల చట్టం అమలు సాధ్యమని అన్నారు. జిల్లాలోని బీసీ సమాజమంతా సభకి తరలిరావాలని కోరారు.
News November 6, 2025
ఎడ్లపాడు: ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

ఎడ్లపాడు పరిధిలో ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు గురువారం అరెస్టు చేశారు. పసుమర్రులో అద్దె ఇంట్లో కార్యకలాపాలు జరుపుతున్నట్లు సమాచారంతో దాడి చేసి మహిళను అదుపులోకి తీసుకున్నామన్నారు. సర్కిల్ పరిధిలో కోడిపందేలు, కోతముక్కలు, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
News November 6, 2025
వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.


