News February 18, 2025

మల్లాపూర్లో పర్యటించిన డీఆర్డీవో పీడీ

image

మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్, ఓబులాపూర్, దామరాజుపల్లి గ్రామాల్లో మంగళవారం DRDO PD రఘువరన్ పర్యటించారు. హుస్సేన్ నగర్, ఓబులాపూర్ నర్సరీలను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్ట్యా షేడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కొత్త దామరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణాన్ని సందర్శించారు. ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

గద్వాల: ఎన్నికల్లో డబ్బు, మద్యంపై నిఘా: ఎస్పీ

image

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరుమాల పంచాయతీలోని నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా, పెట్రోలింగ్‌ను పెంచామన్నారు. ఎవరైనా అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News November 28, 2025

పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

image

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.

News November 28, 2025

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

image

ఖమ్మం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ పట్ల ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.