News February 18, 2025
మల్లాపూర్లో పర్యటించిన డీఆర్డీవో పీడీ

మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్, ఓబులాపూర్, దామరాజుపల్లి గ్రామాల్లో మంగళవారం DRDO PD రఘువరన్ పర్యటించారు. హుస్సేన్ నగర్, ఓబులాపూర్ నర్సరీలను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్ట్యా షేడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కొత్త దామరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణాన్ని సందర్శించారు. ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
రోజూ తలస్నానం చేయొచ్చా?

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.
News April 17, 2026
APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్-Cకు 35, సైంటిస్ట్-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.
News April 17, 2026
శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.


