News January 31, 2025

మల్లాపూర్‌: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన జమాల్ (36) అప్పుల బాధతో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలుగా గల్ఫ్ దేశానికి వెళ్లి పని సరిగా లేకపోవడంతో తిరిగి వచ్చాడు. చేసిన అప్పులు ఎక్కువై బాధతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగాడు. చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.

Similar News

News February 22, 2026

ఆసిఫాబాద్: ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

image

ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 5,847 మంది విద్యార్థులకు గాను 5,645 మంది హాజరైనట్లు DCO శారద తెలిపారు. 96 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు.

News February 22, 2026

HYD: అంగన్వాడీ.. ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరి

image

ఊపిరిసలపని పనులతో అంగన్వాడీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. NHTS, పోషణ ట్రాకర్ యాప్‌లో గ్రోత్ మానిటరింగ్, డైలీ హాజరు, సర్వేలు, గృహ సందర్శనలు, MAM, SAM పిల్లలు, గర్భిణులు, బాలింతల మెడికల్ రికార్డులు, THR ఫొటోలు, ABHA, APAAR, CBE ఈవెంట్లు, ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలతో పాటు అదనంగా 10 రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. BLO డ్యూటీ, పల్స్ పోలియోతో పాటు పోషకాహార పంపిణీ, ప్రీ స్కూల్ బోధనతో సతమతమవుతున్నారు.

News February 22, 2026

KNR: వేధింపులతో భార్య ఆత్మహత్య.. చికిత్స పొందుతూ భర్త మృతి

image

మనస్పర్థలు <<19178040>>రెండు నిండు<<>> ప్రాణాలను బలితీసుకున్నాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఈనెల 17న తీగల గుట్టపల్లి వద్ద మమత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోగా, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త నరేశ్ ఆదివారం మృతి చెందాడు. గోదావరిఖనిలో అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలైన నరేశ్‌‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 14 నెలల క్రితమే వీరికి వివాహమైంది.