News January 31, 2025

మల్లాపూర్‌: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన జమాల్ (36) అప్పుల బాధతో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలుగా గల్ఫ్ దేశానికి వెళ్లి పని సరిగా లేకపోవడంతో తిరిగి వచ్చాడు. చేసిన అప్పులు ఎక్కువై బాధతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగాడు. చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.

Similar News

News February 18, 2025

HYD: మనవడి చేతిలో తాత హత్య.. కత్తి స్వాధీనం 

image

HYDలోని సోమాజిగూడలో మనవడి చేతుల్లో తాత జనార్దనరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మనవడు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీ సోమవారం ముగియగా.. బీఎస్ మక్తాలోని ప్రార్థన మందిరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తి, ధరించిన దుస్తులను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా మంటల్లో కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News February 18, 2025

సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

image

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు <<15474129>>దారుణ <<>>హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 18, 2025

విద్యార్థుల వద్ద కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవు

image

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.

error: Content is protected !!