News February 28, 2025

మల్లాపూర్: ఉరి వేసుకుని యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మవాడకి చెందిన ముచ్చుకుర్తి రాజ్‌కుమార్(32) అనే యువకుడు గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

కడప: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

image

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.