News June 25, 2024
మళ్లీ కుప్పం బిడ్డగానే పుడతా: చంద్రబాబు
కుప్పంలో చంద్రబాబు బహిరంగ సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది. దీంతో సమావేశం కొనసాగిద్దామా? కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. ‘కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చా. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరు. 40 ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజికవర్గం. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు అన్నారు.
Similar News
News January 16, 2025
తిరుమలలో విషాదం.. బాలుడి మృతి
తిరుమల వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డ ఓ బాలుడు మృతిచెందాడు. కడప టౌన్ చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీనివాస రాజు, సాత్విక్(3) అనే ఇద్దరు కుమారులతో కలిసి తిరుమలకు వచ్చారు. సాయంత్రం అన్నతో ఆడుకుంటూ సాత్విక్ కిందపడగా.. తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 16, 2025
నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్
నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్‌బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 15, 2025
ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఏర్పేడు మండలం మేర్లపాక హైవే సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఏర్పేడు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిది నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌన్‌పేటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.