News November 9, 2024
మళ్లీ చిలకలూరిపేటకు విడదల రజిని

మాజీ మంత్రి విడదల రజినికి YCP అధిష్ఠానం మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి అయిన ఆమె.. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో ఓడిపోయారు. అటు చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు ఓటమి చెందారు. పల్నాడులో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించిన జగన్.. విడదల రజినిని తిరిగి యథాస్థానానికి పంపారు. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ కామెంట్.
Similar News
News September 14, 2025
గుంటూరు జిల్లాలో దంచికొట్టిన వర్షం

గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.
News September 14, 2025
గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.
News September 13, 2025
గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.