News November 9, 2024

మళ్లీ చిలకలూరిపేటకు విడదల రజిని

image

మాజీ మంత్రి విడదల రజినికి YCP అధిష్ఠానం మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి అయిన ఆమె.. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో ఓడిపోయారు. అటు చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు ఓటమి చెందారు. పల్నాడులో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించిన జగన్.. విడదల రజినిని తిరిగి యథాస్థానానికి పంపారు. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ కామెంట్.

Similar News

News December 11, 2024

కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లి వద్ద కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. వైకుంఠపురం బ్యారేజీ-10 టీఎంసీలు, చోడవరం బ్యారేజీ-4 టీఎంసీలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవి అమరావతి ప్రాంతంలో తాగునీరు&పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడతాయని, అలాగే రివర్ ఫ్రంట్‌ను రూపొందించడంలో కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు. 

News December 11, 2024

గుంటూరు: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది. 

News December 11, 2024

అమరావతికి వెళ్లిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

image

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మీ, అరుణ్ బాబు, వెంటక మురళి అమరావతి వెళ్లారు. నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.