News September 24, 2024
మళ్లీ తెరుచుకున్న సరళసాగర్ సైఫర్లు
వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెచ్చుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు నిండడంతో గాలి పీడనం ద్వారా.. 3 సైఫర్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో ఉన్న వరద నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వరద నీరు పారుతుంది. దీంతో ప్రయాణికుల సందడిగా మారింది. మదనాపూర్ రైల్వే గేట్ సమీపంలో మారేడు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Similar News
News October 10, 2024
గద్వాల: పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం నెలకొంది. మేడికొండకు చెందిన బోయ లక్ష్మన్న(24) పాముకాటుతో మృతి చెందాడు. లక్ష్మన్న నిన్న పొలంలో పని చేస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన గద్వాల వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
News October 10, 2024
MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలమైన హాజ్‌కు జిల్లా నుంచి 170 మంది యాత్రికులు ఎంపికయ్యారు. యాత్రకు సంబంధించి బుధవారం బాక్స్ కాంప్లెక్స్‌లోని హాజ్ సొసైటీ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దరఖాస్తులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి హాజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మొరాజుద్దీన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 9, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.