News September 4, 2024
మళ్లీ మున్నేరుకు పెరుగుతున్న వరద

ఖమ్మం మున్నేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం ఉదయానికి 10 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 13 అడుగులకు చేరింది. క్రమంగా 3 అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతికి సర్వం కోల్పోయామని, మళ్ళీ ముంపు ప్రాంతాలకు వరద చేరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 24, 2025
రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.
News November 24, 2025
KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News November 24, 2025
ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.


