News March 24, 2025
మళ్లీ సొంతగూటికేనా!

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.
Similar News
News April 1, 2025
ATP: పింఛన్ పంపిణీలో పాల్గొనున్న కలెక్టర్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం పర్యటించనున్నారు. తాళ్లకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు టీడీపీ కార్యాలయం సోమవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పింఛన్ పంపిణీ చేయనున్నారు.
News March 31, 2025
ATP: రేపు జిల్లాస్థాయి రాతిదూలం పోటీలు

అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్ద పేటలో మంగళవారం జూనియర్ విభాగంలో రాతిదూలం పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. శ్రీ సంజీవరాయ స్వామి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.
News March 31, 2025
వ్యక్తిగత గొడవల్ని పార్టీలకు ఆపాదించవద్దు: పరిటాల

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.