News March 24, 2025

మళ్లీ సొంతగూటికేనా!

image

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.

Similar News

News April 17, 2025

ATP: డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 

image

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ నిధుల వినియోగం, ప్రాజెక్టుల ఎంపిక ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో హిందూపురం MP పార్థసారథి, MLAలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, JC అస్మిత్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2025

అనంత– బెంగళూరు రైలుకు భారత రైల్వే శాఖ ఆమోదం

image

శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పలు సందర్భాల్లో ఈ విషయం పై ప్రస్తావించారు. అతి కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభిస్తారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News April 17, 2025

అనంతపురంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ 

image

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, తెగల వర్గాల నుంచి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఎస్పీ జగదీష్, DRO ఏ.మలోల, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

error: Content is protected !!