News August 23, 2024

మసీదును ప్రారంభించిన మంత్రి ఫరూక్

image

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మసీదును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మదరసాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2024

చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

image

సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి NMC మంజూరు చేసినా సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలని విమర్శించారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలలపై CBN నీళ్లు చల్లారని ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

News September 14, 2024

‘హైడ్రా’ కూల్చివేతలపై హైకోర్టుకు కాటసాని భార్య

image

TS అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. FTL పరిధిలో లేకున్నా వ్యవసాయ భూమిలోని షెడ్, కాంపౌండ్‌ను కూల్చివేశారని తెలిపారు. 9ఎకరాల భూమిలో దానిమ్మ, మామిడి, జామ వంటి మొక్కలు పెంచుతున్నామని, కాంపౌండ్ నిర్మాణానికి అనుమతివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.

News September 14, 2024

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: కర్నూలు కలెక్టర్

image

జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 20వ తేదీన కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.