News February 21, 2025
మసీదుల వద్ద సదుపాయాలు కల్పించాలని HNK కలెక్టర్‌కు వినతి

రానున్న రంజాన్ పండగ సందర్భంగా హనుమకొండ ప్రాంతంలో ఉన్న మసీద్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నుంచి సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ మిర్జా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మిర్జా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
ASF జిల్లాలో 54 హాట్‌స్పాట్‌ల గుర్తింపు: SP

ASF జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో షీ టీమ్ ద్వారా 54 హాట్‌స్పాట్ ప్రదేశాలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. విద్యార్థులకు 19 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 4 రెడ్ హ్యాండెడ్ కేసులు నమోదు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా 2 ఫిర్యాదులు స్వీకరించామని చెప్పారు. హరాస్మెంట్‌కు గురైతే ASF: 8712670564, కాగజ్‌నగర్: 8712670565కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
News March 2, 2026
అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్

అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. చర్చల పునరుద్ధరణకు తమ నుంచి ప్రతిపాదనలు వచ్చాయంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాల కోసం ట్రంప్ తమ సైనికులను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యాధిపతి భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
News March 2, 2026
పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.


