News January 19, 2025
మస్కట్‌లో కడప వ్యక్తి మృతి.. స్పందించిన లోకేశ్
కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.
Similar News
News January 20, 2025
గుంటూరులో నేటి నుంచి పశు వైద్య శిబిరాలు
ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 19, 2025
గుంటూరు: బిడ్డతో సహా తల్లి సూసైడ్
విజయవాడ నుంచి చెన్నై వెళ్లే నేషనల్ హైవే సమీపంలో బుడంపాడు వద్ద రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఓ మహిళ తన బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు లైట్ గ్రీన్ కలర్ టాప్, వంకాయ రంగు ప్యాంటు గల పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, పాప సిమెంటు రంగు టీ షర్టు ధరించి ఉన్నదని గుంటూరు GRP సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2025
గుంటూరులో CA విద్యార్థి ఆత్మహత్య
బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.