News October 17, 2024
మహనీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి: రాహుల్ రాజ్

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కొమరం భీం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని రాహుల్ రాజ్ అన్నారు.
Similar News
News January 1, 2026
మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.
News January 1, 2026
భారీ పొగమంచు.. వాహనదారులకు ఎస్పీ అలర్ట్

మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పొగమంచు సమయంలో వేగం తగ్గించి, హెడ్లైట్లు ఆన్ చేసి, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు. ద్విచక్ర, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.
News January 1, 2026
మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.


