News October 17, 2024
మహనీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి: రాహుల్ రాజ్
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కొమరం భీం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని రాహుల్ రాజ్ అన్నారు.
Similar News
News November 7, 2024
మునిపల్లి: చికిత్స పొందుతూ గురుకులం ప్రిన్సిపల్ మృతి
మునిపల్లి మండలం బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అర్చన(36) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. వెంటనే లింగంపల్లిలోని ప్రైవేట్ చికిత్సకి తరలిచంగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె స్వస్థలం HYD మలక్ పేటలోని అజంతా కాలనీ. అర్చన భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.
News November 7, 2024
పటాన్‌చెరు: సంస్థాగత ఎన్నికల పర్వం-2024 రాష్ట్రస్థాయి కార్యశాల
బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో గురువారం సంస్థాగత ఎన్నికల పర్వం-2024 రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2024
మెదక్: నెరవేరనున్న డీఎస్సీ-2008 అభ్యర్థుల 15 ఏళ్ల కల
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ-2008 సెలెక్టెడ్ అభ్యర్థుల కల నెరవేరబోతోంది. వీరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది సెలెక్టెడ్ లిస్టులో ఉన్నప్పటికీ 180 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వెరిఫికేషన్ ఫైనలైజేషన్ రేపటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.