News March 8, 2025
మహబూబాబాద్‌లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎస్పీ

పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌ను, https://yipschool.in, బ్రోచర్‌ను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకాన్ ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ప్రవేశాలలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పోలీసు కుటుంబాలు, సాధారణ పిల్లలకు తర్వాత అడ్మిషన్లు ఉంటాయన్నారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మోడల్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
కరీంనగర్: బాలికపై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు

2022 ఫిబ్రవరి 3న నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగిక దాడి చేసిన నేరస్థుడు మడుపు నర్సింహా చారికి శిక్ష పడింది. POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
ప.గో: వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు ఇక లేరు

వెండితెరపై తనదైన హాస్యంతో అలరించిన అలనాటి నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మరణించారు. గురువారం చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకు చెందిన జోసెఫ్.. ‘పాతాళభైరవి’ సహా ఆరు చిత్రాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాస్టర్‌గా ఆయన ప్రసంగంలో నవ్వులు పూయించేవారు.


