News April 8, 2025
మహబూబాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు అందించే అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కులాల సంక్షేమాధికారి నరసింహస్వామి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎస్సీ కుల విద్యార్థులు రూ.5 లక్షల ఆదాయం మించకుండా పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనవారు దీనికి అర్హులన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.


