News April 8, 2025

మహబూబాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు అందించే అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కులాల సంక్షేమాధికారి నరసింహస్వామి తెలిపారు. – రూ.5 లక్షల ఆదాయం మించకుండా పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తెలంగాణకు చెందిన ఎస్సీ విద్యార్థులు అర్హులన్నారు.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్నారు. 

Similar News

News December 2, 2025

కాంతార వివాదం: క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

image

కాంతార ఛాప్టర్-1 విషయంలో తలెత్తిన <<18445119>>వివాదంపై<<>> బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఆ చిత్రంలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. అలాంటి సీన్ చేయడం ఎంత కష్టమో ఓ నటుడిగా నాకు తెలుసు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

మహబూబ్‌నగర్: జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల నుంచి జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

News December 2, 2025

300 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఓరియెంటల్ <<>>ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ/PG, PG(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. బేసిక్ పే రూ.50,925 చెల్లిస్తారు.