News February 26, 2025
మహబూబాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉ.8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రభుత్వ, ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు పక్కాగా అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 25, 2025
కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను పదో తరగతి విద్యార్థి మహేశ్ కిరాతకంగా <<15871409>>కొట్టిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పదో తరగతి విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News March 25, 2025
ఢిల్లీ గెలుపుపై కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

లక్నోపై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుంది. మన గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్, బాల్, ఫీల్డ్‌లో మనం చాలా మెరుగుపరుచుకోవాలని నాకు తెలుసు. దయచేసి మాతో ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అని కెవిన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
News March 25, 2025
జస్టిస్ వర్మ నగదు ఘటన: ఎంపీలతో ధన్‌ఖడ్ కీలక సమావేశం

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం 4:30కు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కాలిపోవడం, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే NJACని అమల్లోకి తీసుకురావడంపై చర్చిస్తారని సమాచారం. నిన్న BJP, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.