News February 25, 2025
మహబూబాబాద్: ఈనెల 27న ఉపాధ్యాయులకు సెలవు

ఈనెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.
Similar News
News October 18, 2025
పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.
News October 18, 2025
రాప్తాడు, ధర్మవరంలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారని అన్నారు. సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
News October 18, 2025
జనగామ: నేడు విద్యాసంస్థల స్వచ్ఛంద బంద్

స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి(శనివారం) రాష్ట్రవ్యాప్త బీసీ బంద్లో భాగంగా జనగామ జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. సోమవారం దీపావళి పర్వదినం సెలవు ఉండడంతో విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు కలిసి వస్తున్నాయి.