News March 8, 2025

మహబూబాబాద్: ఎస్ఐ సునందను సన్మానించిన అదనపు కలెక్టర్..

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో షి టీమ్ ఎస్ఐ సునంద పాల్గొని షీ టీమ్స్, మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్,పై అవగాహన కల్పించారు. షి టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మహిళలు ఏ విధమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సునందను ఘనంగా శాలువాతో అధికారులు సన్మానించారు.

Similar News

News October 16, 2025

భారత్‌పై WTOకి చైనా ఫిర్యాదు

image

ఇండియా అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్, EV బ్యాటరీ సబ్సిడీలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది దేశీయ తయారీదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని, చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. తమ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు, హక్కుల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని వారి వాణిజ్య శాఖ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే IND అధిక సబ్సిడీలు అందిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.

News October 16, 2025

నెల్లూరు: నెల రోజులు ఇండస్ట్రీ పార్ట్నర్ షిప్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్‌లో సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.

News October 16, 2025

గ్రీన్ క్రాకర్స్ సురక్షితమేనా?

image

పొల్యూషన్ తగ్గించేందుకు వాడే <<18010671>>గ్రీన్ క్రాకర్స్‌<<>> కూడా పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే పొగ, శబ్దం తక్కువ చేసినప్పటికీ వీటి నుంచి వెలువడే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరే ప్రమాదముందని చెబుతున్నారు. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.