News February 26, 2026
మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీష్ నియామకం

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా నియమాక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్, హనుమకొండ కలెక్టర్‌గా పని చేశారు. స్నేహ శబరీష్ మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి.
Similar News
News April 18, 2026
కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.