News February 26, 2026
మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ

మహబూబాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. 2013 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జనవరి 2, 2024న మహబూబాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నిబద్ధతతో జిల్లాలో పనిచేశారు. ఆయన తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టర్‌గా నియమకమయ్యారు.
Similar News
News April 20, 2026
తూ.గో: బాలికపై అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టి వాతలు పెట్టారు..!

పల్నాడు(D) నాదెండ్ల(M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. రాజమండ్రికి చెందిన దంపతులు ఇక్కడ మిల్లులో పనిచేస్తున్నారు. వీరి ఇంటి పక్కనే ఉండే ప్రసాద్‌దాస్ అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తోటి కార్మికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
News April 20, 2026
CBN నిర్ణయం.. విశాలంగా తిరుమల మాడ వీధులు.!

2000–04 మధ్య చంద్రబాబు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించి ఇరుకైన మాడ వీధులను విశాలంగా నిర్మించారు. తిరుమలలో జనాభా తగ్గించి యాత్రికులకు ఎక్కువ స్థలం కేటాయించే ఉద్దేశంతో ఆ పని చేశారు. అక్కడ ఉన్నవారికి తిరుపతి పరిసరాల్లో పునరావాసం కల్పించారు. ప్రస్తుతం 1.15లక్షల మంది ఆలయ మాడవీధుల్లో స్వామిని వీక్షించే ఛాన్స్ ఉంది. దీనిపై మొదట వ్యతిరేకత వచ్చినా ప్రస్తుతం భక్తుల నుంచి CBNకు ప్రశంసలు అందాయి.
News April 20, 2026
ఇంద్రవెల్లి: నేలమట్టం చేసినా వెరవని ఆదివాసీలు

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆదివాసీ అమరవీరుల 80 అడుగుల స్థూపం చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. 1986లో దుండగులు ఈ స్థూపాన్ని కూల్చివేయగా, ఆదివాసీల ఆందోళనల నేపథ్యంలో 1987లో ప్రభుత్వం పున:నిర్మించింది. దశాబ్దాల పాటు ఆంక్షల నీడలోనే నివాళులర్పించిన గిరిజనులు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వేచ్ఛగా వీరులను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అమరవీరుల స్మృతి వనంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.


