News February 8, 2025
మహబూబాబాద్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News November 27, 2025
WGL: పంచాయతీ ఎన్నికలు.. బ్యాంకులకు అభ్యర్థుల పరుగులు..!

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు నూతన బ్యాంకు ఖాతాలు కావాలని ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించడంతో అభ్యర్థులు ఆయా బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి WGL జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు, మూడు బ్యాంకులకు చెందిన శాఖలు ఉండగా, వాటిల్లో ఇదివరకే అభ్యర్థులకు ఖాతాలు ఉన్నాయి. కాగా, మళ్లీ ఖాతా కావాలంటే బ్యాంకర్లు ఇవ్వడం లేదు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
News November 27, 2025
KMR: పీహెచ్సీ వైద్యాధికారులతో డీఎంహెచ్వో సమీక్ష

కామారెడ్డి కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్వో డా.విద్య సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సమయానుసారంగా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.


