News February 8, 2025
మహబూబాబాద్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News February 12, 2026
ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
News February 12, 2026
వరంగల్: అప్పుడు 76.26%, ఇప్పుడు 78.25%

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 12 మున్సిపాలిటీల్లో కలిపి 78.25శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2020 ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు, 18 ఏకగ్రీవం కాగా, 182 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 2,32,763 ఓటర్లకు 1,77,508 మంది ఓటేశారు. 2020లో 76.26% పోలింగ్ నమోదైంది.
News February 12, 2026
కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


