News March 21, 2025
మహబూబాబాద్: చిన్నారిపై వీధి కుక్కల దాడి

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. వెన్నెల-మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నందిని అంగన్వాడీ నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖం, తలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఎంజీఎంకు తరలించారు.
Similar News
News October 31, 2025
2,790 మంది ఇండియన్స్‌ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.
News October 31, 2025
PRG: ఉ‘సిరి’కి భారీ డిమాండ్

పరిగి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పరిగి మార్కెట్‌లో 250గ్రా. ఉసిరి రూ.30-50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.


