News March 8, 2025

మహబూబాబాద్: ‘జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి’

image

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ, సెక్రటరీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సురేశ్ కోరారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా, సివిల్, భూతగాదాలు, మోటారు వాహన ప్రమాదాలు, వివాహ, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Similar News

News October 13, 2025

‘ఉల్లి’తో రైతుకు మేలు జరగాలంటే?

image

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కానీ ఆ ఉల్లిని పండించే రైతుకు కన్నీళ్లు తప్పట్లేదు. కిలో ₹5-10 మాత్రమే పలుకుతుండటంతో అన్నదాతలు వాపోతున్నారు. రేటు పడిపోయినా ఇబ్బంది లేకుండా ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆనియన్ ఫ్లేక్స్, పొడి, పేస్ట్, నూనె, ఊరగాయలు, చట్నీలు తయారుచేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
* ప్రతిరోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 13, 2025

హగ్‌కు రూ.3.73 లక్షల ఫీజు.. యువతిపై ట్రోల్స్

image

చైనాలో ఓ యువతి చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. చైనీస్ పద్ధతి ప్రకారం యువతికి యువకుడి ఫ్యామిలీ గిఫ్ట్‌గా ₹25 లక్షలిచ్చింది. ఇంతలో ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసి మనీ తిరిగివ్వడానికి ఒప్పుకుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో తనను హగ్ చేసుకున్నందుకు ₹3.73 లక్షల ఫీజు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. SMలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

News October 13, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

image

HYD జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పెసరకాయ పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా మరొక స్వతంత్ర అభ్యర్థిగా చాలోక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 21 వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉండగా 24 వరకు విత్ డ్రాకు అవకాశం ఉంది.