News April 17, 2025

మహబూబాబాద్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

image

మహబూబాబాద్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 13, 2025

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

News August 13, 2025

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ డీఎంహెచ్ఓ

image

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ శివారులోని పానగల్ యూపీహెచ్‌సీని ఇవాళ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. జ్వరాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.

News August 13, 2025

సురేశ్ రైనాకు ED సమన్లు

image

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కేసులో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్‌కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది.