News February 16, 2025
మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ముఖ్య గమనిక

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని మహబూబాబాద్ జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్కు వినతి పత్రాలతో రావద్దని సూచించారు.
Similar News
News January 8, 2026
రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

ట్రైన్లలో కోచ్ల శుభ్రత, బెడ్ రోల్స్కు సంబంధించి Rail Madad యాప్లో గత ఏడాది సెప్టెంబర్లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్బ్యాక్లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.
News January 8, 2026
పెనమలూరులో గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెనమలూరు-వణుకూరు రోడ్డులో ఎస్ఐ ఫిరోజ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని విచారించగా, వారి వద్ద నుంచి 2 కేజీల పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరుకి చెందిన ప్రదీప్ కుమార్, అజయ్ బాబులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
News January 8, 2026
చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.


