News March 24, 2024
మహబూబాబాద్: తస్లీమాకు 13 రోజుల రిమాండ్
అనిశాకు చిక్కిన MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. ఈనెల 16న WGL జిల్లాలో ఏసీబీ న్యాయస్థానాన్ని ప్రారంభించగా.. ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన MHBD సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా, పొరుగు సేవల ఉద్యోగి ఎ.వెంకట్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు వారిద్దరిని కరీంనగర్ జైలుకు తరలించారు.
Similar News
News November 12, 2024
దుగ్గొండి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి
విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రైతు వరికెల గోవర్ధన్ (50) తన వ్యవసాయ భూమిలో యాసంగి పంట కోసం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు నడవక పోవడంతో ఫ్యూజ్‌లు సరి చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
News November 12, 2024
వరంగల్: పారా మెడికల్ ఎంట్రెన్స్ కౌన్సెలింగ్ వాయిదా
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మంగళవారం, బుధవారం నిర్వహించాల్సిన పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ వాయిదా పడింది. గతంలో కాకతీయ మెడికల్ కళాశాల తరఫున పారా మెడికల్ లో వివిధ కోర్సులకు గాను దరఖాస్తులను స్వీకరించారు. వాటికి సంబంధించిన కౌన్సెలింగ్ అనివార్య కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కళాశాల అధికారులు తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారన్నారు.
News November 12, 2024
వరంగల్: వివాహిత మృతి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం.. సట్టు శోభారాణి (33) తన భర్త తాగుతున్నాడని ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.