News March 5, 2025
మహబూబాబాద్: నేడే పరీక్షలు.. ALL THE BEST

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,302 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 4,392, సెకండియర్‌లో 4,910 మంది విద్యార్థులు రాయనుండగా.. 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News February 24, 2026
పెద్దపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాలలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌పై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మార్చి 5 నాటికి బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందించాలని ఆదేశించారు.
News February 24, 2026
అదుపులో డయేరియా: శ్రీకాకుళం కలెక్టర్

శ్రీకాకుళం పట్టణ కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 24, 2026
కొత్త పార్టీ ప్రకటించిన శశికళ

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. జయలలిత, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ ఫొటోలు, ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో ఉన్న జెండాను ఆవిష్కరించారు. త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు. తమిళ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు.


