News March 18, 2025
మహబూబాబాద్: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 8,194 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News March 18, 2025
బాలికపై సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్

AP: కృష్ణా(D) వీరపనేనిగూడెంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న రాత్రి స్నేహితురాలి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను యువకులు కిడ్నాప్ చేశారు. 3 రోజులపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితుల్లో ఒకరు ఇటీవల టెన్త్ పరీక్ష రాసినట్లు గుర్తించారు.
News March 18, 2025
రైల్వే మంత్రికి మిథున్ రెడ్డి వినతులు ఇవే..!

సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. తిరుపతి- హుబ్లీ ఇంటర్ సిటీ రైలు రెడ్డిపల్లిలో ఆగేలా చూడాలని కోరారు. తిరుపతి నుంచి కడపకు ఉదయం 5:10 గంటలకు బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఇకపై 6.10 గంటలకు బయలుదేరేలా చూడాలన్నారు. చెన్నై ఎగ్మోర్-ముంబై ట్రైన్‌కు కోడూరు, రాజంపేటలో, హరిప్రియ, సంపర్క్ క్రాంతికి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని విన్నవించారు.
News March 18, 2025
డబుల్ హెల్మెట్ ఎఫెక్ట్.. విశాఖలో 39 బైకులు స్వాధీనం

బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరని విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆర్.సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎన్ఏడీ, మద్దిలపాలెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యాక వాహనం నడిపితే వాహనం స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.