News March 8, 2025

మహబూబాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజలకు ఒక శుభవార్త. పట్టణ కేంద్రంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రైల్వే మూడో లైన్ మరమ్మతుల నిమిత్తం RUB582B అండర్ బ్రిడ్జ్‌ను మూసివేసిన విషయం తెలిసింది. తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయని, ఈనెల 11వ తేదీన అండర్ బ్రిడ్జ్ రీ ఓపెన్ చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు.

Similar News

News December 4, 2025

పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

image

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్‌లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.

News December 4, 2025

ఇసుక మాఫియా ఒత్తిడికి అధికారుల దాసోహం

image

పనులు నడుస్తున్నాయో లేదో తెలుసుకోకుండానే నిలిచిపోయిన పనుల పేరిట ఇసుక రవాణాకు అధికారులు అనుమతిస్తున్నారు. వేములవాడ ZP బాలికల హై స్కూల్ ఆవరణలో కంప్యూటర్ గది, లైబ్రరీ నిర్మాణం పనులు మూడు నెలల కింద ఆగిపోయినప్పటికీ తాజాగా 16 ట్రిప్పుల ఇసుకకు తహశీల్దార్ అనుమతి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. వాస్తవాలు పరిశీలించకుండానే ఇసుక మాఫియా ఒత్తిడికి, ముడుపులకు ఆఫీసర్లు తలొగ్గి అనుమతులిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News December 4, 2025

ADB: పల్లె నుంచే గడ్డెన్న ప్రస్థానం..!

image

ముధోల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పేరు గడ్డెన్న. భైంసా మండలం దేగం సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం 6 సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రి వరకు కొనసాగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. అందుకే ఆయనంటే పల్లె ప్రజల్లో ఓ గౌరవం. గడ్డెన్న తన బిడ్డలను నేరుగా పెద్ద పదవులు కట్టబెట్టవచ్చు కానీ అలా చేయలేదు. కొడుకు విఠల్ రెడ్డిని సర్పంచ్‌గా పోటీ చేయించి, క్రమంగా శాసనసభ వరకు తీసుకెళ్లారు.